9 May, 2026 | 10:45 AM

Breaking News

కొత్త సీడీఎస్‌గా రాజా సుబ్రమణి నియామకం   •   నేవీ చీఫ్‌గా వైస్ అడ్మిర‌ల్ కృష్ణస్వామినాథ‌న్ నియామ‌కం   •   గర్భం దాల్చిన మైనర్ బాలిక... యువకుడిపై కేసు నమోదు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. మాజీమంత్రి గంగుల హౌస్ అరెస్ట్   •   తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్.. అధికారానికి అడుగు దూరంలో విజయ్!   •   నామకరణ మహోత్సవంలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్   •   ట్రిపుల్ ICG ఫ్లోరెసెన్స్ సాంకేతికతతో రోబోటిక్ ఈసోఫేజియల్ క్యాన్సర్ శస్త్రచికిత్సలో ప్రపంచస్థాయి ప్రమాణాన్ని నెలకొల్పిన హైదరాబాద్ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI)   •   రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయి   •   తమిళనాట తికమక!   •   భయం అవుట్ భరోసా ఇన్   •  

బాన్సువాడలో డిగ్రీ కళాశాల ఉద్యోగి దుర్మరణం — కుటుంబ బెదిరింపులే కారణమా?

28-02-2026 07:11 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేట ఎస్ఆర్ఎన్కె ప్రభుత్వ  డిగ్రీ కళాశాలలో రికార్డ్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న షేక్ అహ్మద్ (50) శనివారం కళాశాల భవనంపై నుండి దూకి ఆత్మ హత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. రెండంతస్తుల భవన్ పై నుండి కింద దూకగానే తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.

అతనికి మద్య సేవించే అలవాటు ఉందని రమజాన్ మాసం ఉండటంతో తాగడంలేదని కొన్ని రోజుల నుండి పరివర్తన విధానం మారి నట్లు సహా ఉద్యోగులు తెలిపారు. శనివారం మృతుడు బాన్సువాడ పోలీస్ స్టేషన్ కు వెళ్లి నాకు నా కుటుంబ సభ్యులు చంపేస్తామని బెదిరిస్తున్నారని చెప్పడనీ  సహా ఉద్యోగులు తెలిపారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉన్నవి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు  తెలిపారు.