చేతులు కోల్పోయిన వారికి పునర్జన్మ
- ‘అపోలో’లో విజయవంతమైన శస్త్ర చికిత్సలు
- వరల్ హ్యాండ్ సర్జరీ డే సందర్భంగా బాధితులకు సత్కారం
హైదరాబాద్, ఆగస్టు 22(విజయక్రాంతి): తీవ్రమైన చేతి గాయాలతో అవయవాలు కో ల్పోయిన వారికి అధునాతన మైక్రో సర్జరీలతో కదలిక, స్వతంత్ర జీవనం, ఆత్మవిశ్వా సాన్ని పునరుద్ధరించిన అపోలో ఆస్పత్రుల వైద్య బృందం.. వరల్ హ్యాండ్ సర్జరీ డే సం దర్భంగా బాధితులను సత్కరించింది. జూబ్లీహిల్స్‌లో శనివారం నిర్వహించిన కార్యక్ర మంలో చేతి శస్త్రచికిత్సల ద్వారా కోలుకున్న బాధితులు, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది పా ల్గొన్నారు.
కార్యక్రమానికి ఫ్యూచర్ సిటీ ట్రా ఫిక్ డీసీపీ శివం ఉపాధ్యాయ ముఖ్య అతిథిగా హాజరై చేతి శస్త్రచికిత్సల నుంచి కోలుకున్న బాధితులను సత్కరించారు. అపోలో ఆస్పత్రుల కన్సల్టెంట్ హ్యాండ్, రిస్ట్ అండ్ మై క్రోసర్జన్ డాక్టర్ గోపీనాథ్ బండారి మాట్లాడుతూ చేతి తెగిపోవడం వంటి ఘటనల్లో తిరిగి అతికించే శస్త్రచికిత్స (రీప్లాంటేషన్) చేయడానికి సమయం అత్యంత కీలకమన్నారు.
కన్సల్టెంట్ హ్యాండ్, రిస్ట్ అండ్ మైక్రోసర్జన్ డాక్టర్ బండి సాహిత్య, అపోలో ఆస్పత్రుల తెలుగు రాష్ట్రాల సీఈవో మిస్టర్ తేజస్వి రావు వీరేపల్లి మాట్లాడుతూ మైక్రోసర్జికల్ రీప్లాంటే షన్‌లో నైపుణ్యం, వేగం అవసరమన్నారు.






