1 July, 2026 | 4:41 AM

జూలై రేషన్ పంపిణీకి సిద్ధం

01-07-2026 12:00 AM

అందుబాటులో 2.15 లక్షల మెట్రిక్ టన్నులు

సివిల్ సప్లయ్‌శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడి

హైదరాబాద్, జూన్ 30 (విజయక్రాంతి): తెలంగాణ పౌర సరఫరాల శాఖ, జూలై నెలకు సంబంధించిన ఆహార ధాన్యాల పంపిణీని మొదలుపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నరేషన్ దుకాణాల్లో 2.15 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సిద్ధంగా ఉంచారు.

దీని ద్వారా ఈ నెలలో 106 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలకు (సుమారు 341 లక్ష ల మందికి) ఎలాంటి ఇబ్బంది లేకుండా వెంటనే బియ్యం అందేలా చేస్తున్నారు. కేంద్ర ఆహార పంపిణీ శాఖ మార్చిలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్, మే, జూన్ నెలల పంపిణీని చాలా వేగవంతం చేసింది. మొత్తం 6.43 లక్షల మెట్రిక్ టన్నుల కోటాలో, ఏప్రిల్ 30 నాటి కే 6.08 లక్షల మెట్రిక్ టన్నుల (95%) బియ్యా న్ని విజయవంతంగా ప్రజలకు అందించింది.

జూలై నెలకు సరిపడా 2.15 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ముందుగానే సిద్ధంగా ఉంచడం వల్ల, ప్రజలు రేషన్ తీసుకోవడానికి దుకాణాల వద్ద ఎదురుచూడాల్సిన పనే ఉండదని ప్రభుత్వం చెబుతోంది. ఈ పంపిణీ  వేగంగా, సురక్షితంగా జరగాలని కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అధికా రులకు ఆదేశించారు. ఆన్‌లైన్ లావాదేవీల ను, వేలిముద్రల (బయోమెట్రిక్) విధానాన్ని ఎప్పటికప్పు డు జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలని ఆయన సూచించారు. ప్రతిరేషన్ దుకాణంలోనూ ఖచ్చితంగా ఈ- పాస్ యంత్రాల ద్వారానే పంపిణీ జరుగుతోంది. దీని ద్వారా బియ్యం వేరే వాళ్ల చేతు ల్లోకి వెళ్లకుండా, ప్రజలకు ఎటువంటి మోసం జరగకుండా చూస్తున్నామని స్టీఫెన్ రవీంద్ర వివరించారు.