12 May, 2026 | 8:59 PM

Breaking News

హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •   నిర్మాణ రంగంలో ముడి సరుకుల ధరలకు అనుగుణంగా నూతన ధరలు చెల్లించండి   •  

ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో రవిచంద్రకు చోటు

01-03-2026 12:58 AM

హర్షం వ్యక్తం చేసిన పలువురు 

కరీంనగర్, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో రచయిత, సినీ విమర్శకులు డాక్టర్ పొన్నం రవిచంద్రకు చోటు లభించింది. సీనియర్ జర్నలిస్టుగా, రచయితగా కవిగా, సినిమా పరిశోధకుడిగా, పలుచిత్రోత్సవాలకు జ్యూరీ సభ్యుడిగా పని చేయడంతో పాటు, నంది, గద్దర్ అవార్డులు అందుకున్న రవిచంద్రకు లైఫ్ టైం లిటరరీ, వాయిస్ ఆఫ్ సినిమా అవార్డును ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఫౌండర్ ఎడిటర్ డాక్టర్ కె. వివేకానంద బాబు ప్రకటించారు.

హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు, తెలుగు సినిమా రచయిత కేవీ విజయేంద్రప్రసాద్ చేతులమీదుగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు డాక్టర్ హరి కుమార్, డాక్టర్ భూపాల్ నానావత్, డాక్టర్ పావని ఈ అవార్డును అందించారు.

ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రవిచంద్ర ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఆయన ఈ అవార్డుకు ఎంపిక చేసిన వివేకానంద బాబు ను అభినందించారు. రవిచంద్ర ఈ మైలురాయికి చేరుకోవడం పట్ల జీవీ శ్యాంప్రసాద్ లాల్, మామిడి హరికృష్ణ, మాడభూషి శ్రీధర్, వేణు ఉడుగుల, అల్లాణి శ్రీధర్, సీవీ నవీన్ కుమార్ కత్తి చేతన్, గౌని తిరుపతి, ఐనంపూడి శ్రీలక్ష్మి, అన్నవరం దేవేందర్, మాడిశెట్టి గోపాల్, పి ఎస్ రవీంద్ర, గాజోజు నాగభూషణం, కూకట్ల తిరుపతి హర్షం వ్యక్తం చేశారు.