25 March, 2026 | 9:35 PM

నష్టపోయిన మొక్కజొన్న రైతులకు రాశి సీడ్ కంపెనీ నష్ట పరిహారం

25-03-2026 07:34 PM

మొక్కజొన్న రైతులకి అండగా నిలిచిన తుడుండెబ్భ నాయకులు

ఏటూరునాగారం,(విజయక్రాంతి): ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో నాసిరకం విత్తనాల వల్ల నష్టపోయిన మొక్కజొన్న రైతుల పక్షాన తుడుందెబ్బ నాయకులు నష్ట పరిహారం చెల్లించాలని పోరాటం చేసిన విషయం తెలిసిందే బుధవారం రోజు రాశి సీడ్స్ కంపెనీ వారు రైతుల పంట సేనులను చూసి పరిశీలించారు. ఎంత మంది రైతులు నష్టపోయినారో ఇదే పరిశీలించి నష్టపోయిన రైతులకు నష్టపోయిన రైతులకు ఎకరాకు 80వేల చొప్పున నష్టపరిహారం చెల్లిస్తామని కంపెనీ ప్రతినిధులు రైతులతో ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఈ వివాదంపై స్పందించిన వ్యవసాయ శాఖ అధికారులు ఏఓ వేణుగోపాల్, ఏఈఓ రాజు కుమార్ పంట పొలాలను క్షేత్రస్థాయిలో పూర్తిగా పరీక్షించి, నష్టం జరిగిన తీరును అంచనా వేశారు. ఈ సందర్భంలో తుడుందెబ్బ నాయకత్వం మాట్లాడుతూ... "ఈ విజయం కేవలం ఒక కంపెనీకి మాత్రమే పరిమితం కాదు. ఏటూరునాగారం మండలంలో రాశి సీడ్స్‌తో పాటు ఇతర కంపెనీల విత్తనాలు వాడి నష్టపోయిన రైతులందరికీ కూడా తక్షణమే నష్టపరిహారం చెల్లించాలి" అని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా రైతులు అందరు కలిసి తుడుం దెబ్బ నాయకులకి తమ పక్షాన పోరాడి న్యాయం జరిగేలా చేసినందుకు కృతజ్ఞతలు తెలియచేసారు