ప్రభుత్వాసుపత్రిలో రోగికి అరుదైనా శస్త్ర చికిత్స..
చెవి భాగం పూర్తిగా విడిపోతే యధా స్థానంలో అమర్చిన వైనం
ప్రభుత్వ ఆసుపత్రి ఈ .ఎన్.టి డాక్టర్ల బృందం ఘనత...
కొత్తగూడెం, ఏప్రిల్ 10, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు ఈఎన్టి, విభాగంలో అరుదైన శస్త్ర చికిత్స చేసి, ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వాసుపత్రి యాజమాన్యం చేసిన ఈ అరుదైన ,ఆపరేషన్ నిదర్శనం. వివరాల్లోకి వెళితే చుంచుపల్లి మండలం, రామవరం గ్రామం , రోగి పేరు నిర్మల ,వయసు 40 సంవత్సరాలు, మహిళ భర్త పేరు రాయమల్లు , నిర్మల నిన్న 9వ తేదీన ప్రభుత్వ ఆసుపత్రిలో ,వైద్య నిమిత్తం చేరడం జరిగింది.
ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లోని ఈఎన్ టి విభాగంలో, అత్యంత క్లిష్టమైన శస్త్ర చికిత్సను , డాక్టర్ సామ్సంగ్ ఆధ్వర్యంలో, ఈఎన్టీ బృందం విజయవంతంగా పూర్తి చేసింది. నిర్మల అనే రోగికి చెవి భాగం పూర్తిగా వేరైపోవడంతో ,ఈ సమస్యను ఈఎన్టి విభాగం వైద్య బృందం అత్యంత జాగరుకతతో శస్త్ర చికిత్స చేసి తన చెవిని పూర్తిగా యధా స్థానంలో శస్త్ర చికిత్స ద్వారా అమర్చడం ఇది డాక్టర్ల ఘనత, అంటున్నారు.
స్థానికులు, ప్రభుత్వ ఆసుపత్రి వైద్య బృందం. చికిత్స కు ముందు తరువాత ఈ రెండు చిత్రాలను, పరిశీలించినట్లయితే ,క్లిష్టమైన చికిత్సను విజయవంతం చేశారని అర్థమవుతుంది. ప్రస్తుతం రోగి పరిస్థితి స్థిరంగా ఉండి మంచి ఫలితాల కోసం వేచి ఉన్నారు. ఈ అరుదైన శస్త్ర చికిత్సలో ,ఈఎన్టీ ఫ్యాకల్టీ అనస్తిష్య బృందం, ఆపరేషన్ థియేటర్ నర్సింగ్ సిబ్బంది, కి టెక్నీషియన్లకు, హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. ఆసుపత్రి బృందం, రోగి బంధువులు ఇలా ఎన్నో అరుదైన ఘనతలు సాధించాలని పట్టణ ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రి యాజమాన్యానికి వైద్య బృందానికి చేతులెత్తి నమస్కరిస్తూ, భవిష్యత్తులో ఎలాంటి సమస్యనైనా పరిష్కరించే అరుదైన ఆసుపత్రిగా పేరుగావిoచాలని ప్రజలు కోరుకుంటున్నారు.




