19 May, 2026 | 3:43 AM

8 నెలలచిన్నారికి అరుదైన కిడ్నీ క్యాన్సర్

19-05-2026 12:51 AM

‘మెడికవర్’లో విజయవంతమైన శస్త్ర చికిత్స నిర్వహణ

హైదరాబాద్, మే 18 (విజయక్రాంతి): మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌లో డాక్టర్ సరితా శ్రీవాస్తవ ఆధ్వర్యంలో ఎనిమిది నెలల చిన్నారి బాలికలో కనిపించిన అరుదైన, అత్యంత ప్రమాదకరమైన కిడ్నీ క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేశారు. బాలిక కడుపు ఉబ్బరం, ఆహారం తీసుకున్న తర్వాత తర చూ వాంతులు అవుతుండటంతో ఆసుపత్రికి తీసుకువచ్చారు.

ఆధునిక స్కానింగ్  ప రీక్షల్లో ఎడమ కిడ్నీలో పెద్ద ట్యూమర్ ఉన్న ట్లు గుర్తించగా, అది విలమ్స్ ట్యూమర్‌గా అనుమానించారు. రోగికి కీమోథెరపీ అనంతరం శస్త్రచికిత్స సహా సమగ్ర మల్టీమోడాలిటీ చికిత్స అందించారు. అనంతర హిస్టోపథాలజీ పరీక్షల్లో ఇది ‘ఎక్స్‌టెన్సివ్ రాబ్డోమ యోబ్లాస్టిక్ డిఫరెన్షియేషన్’ కలిగిన విల్మ్స్‌ట్యూమర్‌గా నిర్ధారణ అయింది. ఇది అత్యంత అరుదైన, ప్రమాదకరమైన రకం కాగా, సాధారణంగా దీని ప్రోగ్నోసిస్ తక్కువగా ఉంటుంది.

అయితే, ఈ హై-రిస్క్ వ్యాధి ఉన్నప్పటికీ చిన్నారి చికిత్సకు అద్భుతంగా స్పం దించింది. చికిత్స పూర్తున 18 నెలల అనంతరం కూడా బాలిక పూర్తిగా ఆరోగ్యంగా ఉం డి, ఫాలోఅప్ స్కానింగ్‌లో ఎలాంటి వ్యాధి ఆనవాళ్లు కనిపించలేదు.ఈ సందర్భంగా డాక్టర్ సరీతా శ్రీవాస్తవ మాట్లాడుతూ, అరుదైన బాల్య క్యాన్సర్లలో త్వరితగతిన నిర్ధారణ, సమయానుకూల చికిత్స, మల్టీడిసిప్లినరీ క్యాన్సర్ కేర్ ఎంతో కీలకమని తెలిపారు.ఈ కేసు సమగ్ర పీడియాట్రిక్ ఆంకాలజీ సేవల పురోగతిని ప్రతిబింబించడమే కాకుండా, దీర్ఘకాలిక సానుకూల ఫలితాలతో ప్రత్యేక క్యాన్సర్ చికిత్స అందించాలనే మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ వైద్య బృందం నిబద్ధతను చాటిచెప్పింది.