5 May, 2026 | 3:51 AM

రామకృష్ణ ఘోష్ ఐపీఎల్‌కు దూరం

05-05-2026 02:30 AM

గాయంతో సీజన్ నుంచి ఔట్

చెన్నై, మే 4 : ఐపీఎల్ 19వ సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ను గాయాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు ఆటగాళ్లు గాయాలతో దూరమవగా ఆ జాబితాలో మరో క్రికెటర్ చేరాడు.  గాయం కారణంగా చెన్నై యువ ఆల్ రౌండర్ రామకృష్ణ ఘోష్ టోర్నీలో మిగిలిన మ్యాచులకు దూరమయ్యా డు. చెపాక్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ ద్వారా రామకృష్ణ ఘోష్ ఐపీఎల్ అరంగ్రేటం చేశాడు.

ఆ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. విల్ జాక్స్ కొట్టిన బంతి ని అందుకునేందుకు డైవ్ చేసి కిందపడిపోయాడు. దీంతో ఘోష్ కుడి కాలికి గాయమైం ది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో టోర్నీకి దూరం కావాల్సి వచ్చింది.  ఈ విషయాన్ని సీఎస్కే యాజమాన్యం ప్రకటించింది. గాయం నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. తన అరంగేట్రం మ్యాచ్‌లో ఘోష్ మూడు ఓవర్లు బౌలింగ్ చేసి 24 పరుగులు ఇచ్చాడు. సూర్యకుమార్ వికెట్ తీశాడు.