శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం
ముకరంపుర, ఆగస్టు 28 (విజయక్రాంతి): రక్షాబంధన్ పర్వదిన స్ఫూర్తిని సమాజంలో విస్తరింపజేయడంతో పాటు సౌభ్రాతృత్వం, పరస్పర గౌరవం, సామాజిక ఐక్యత, దేశభక్తి భావాలను ప్రజల్లో పెంపొందించాలనే ఉద్దేశంతో శ్రీ సరస్వతీ శిశుమందిర్ హై స్కూల్, కరీనగర్ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రత్యేక రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు కరీంనగర్ పట్టణంలోని మంచిర్యాల చౌరస్తా, కోర్ట్ చౌరస్తా, భగత్‌సింగ్ సర్కిల్, కమాన్ సర్కిల్ మరియు విద్యానగర్ ప్రాంతాల్లోని దుకాణాలు, కార్యాలయాలు, వివిధ సంస్థలను సందర్శిచి వారికి రాఖీలు కట్టారు.ప్రత్యేకంగా ప్రజల రక్షణ కోసం విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసు సిబ్బంది, సివిల్ పోలీసు సిబ్బంది వద్దకు వెళ్లి విద్యార్థినులు ఆత్మీయంగా రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా వారు, “మీకు మేము రక్ష
మాకు మీరు రక్ష
మనందరం దేశానికి రక్ష! అనే సందేశాన్ని అందిస్తూ రక్షాబంధన్ యొక్క విశాలమైన అర్థాన్ని చాటి చెప్పారు. కార్యక్రమంలో శ్రీ సరస్వతీ విద్యాపీఠం కరినగర్ జిల్లా ఉపాధ్యక్షులు పాక పావన కృష్ణ, పాఠశాల కార్యదర్శి ఇంజనీర్ కోల అన్నారెడ్డి, ఆచార్య బృందం మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.






