28 August, 2026 | 2:28 PM

Breaking News

రాఖీ కట్టేందుకు వెళ్తుండగా ప్రమాదం.. మహిళకు తీవ్రగాయాలు   •   ప్రధాని మోదీ, తల్లిదండ్రులపై ఫేస్‌బుక్‌లో అసభ్యకర పోస్ట్   •   ఎమ్మెల్యే పోచారంకు రాఖీ కట్టిన సోదరిమణి దొడ్ల సత్యవతి   •   విద్యుత్ పోరాట అమరవీరుల స్పూర్తితో భవిష్యత్ పోరాటాలు   •   ప్రయాణికుల కష్టాలు తీర్చేలా ఆర్‌ఓబీ పనులు వేగవంతం చేయాలి   •   సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రులు   •   మదర్‌ థెరిసా పొదుపు సమితిపై ఆరోపణల కలకలం   •   పేద విద్యార్థులకు డాక్టర్ సంతోష్ రెడ్డి ఆర్థిక సహయం   •   జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •  

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్

28-08-2026 01:42 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్(Former Minister Satyavathi Rathod) మహబూబాబాద్‌లోని తన స్వగృహంలో జర్నలిస్టు సోదరులకు రాఖీలు కట్టి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడానికి, వార్తల సేకరణ కోసం క్షేత్రస్థాయిలో నిరంతరం శ్రమించే జర్నలిస్టుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వారికి చిరుకానుకగా హెల్మెట్లను అందజేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జర్నలిస్టులు ప్రజలకు, అధికారులకు, రాజకీయ నాయకులకు వారధిగా ఉంటూ నిత్యం వార్తల సేకరణ కోసం క్షేత్రస్థాయిలో పర్యటిస్తుంటారని అన్నారు. వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని తన వంతు బాధ్యతగా కొందరు జర్నలిస్టు మిత్రులకు హెల్మెట్లు అందిస్తున్నట్లు తెలిపారు.జర్నలిస్టుల భద్రతతో పాటు ప్రజల ప్రాణ రక్షణకు హెల్మెట్ వినియోగం ఎంతో కీలకమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా హెల్మెట్ ధరించి ప్రయాణించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఆంగోత్ బిందు పాల్గొన్నారు.