సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి
సీఐ తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు
చర్యలు తీసుకోవాలని బాధితుల డిమాండ్
కోదాడ, ఆగస్టు28(విజయక్రాంతి): పట్టణంలో డబ్బా కొట్టు తొలగింపు వ్యవహారంపై బాధితులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. తమకు సమాచారం ఇవ్వకుండా డబ్బా కొట్టును తొలగించారని ఆరోపిస్తూ బాధితులు రోడ్డుపై బైఠాయించారు. గత 30 ఏళ్లుగా దానిపైనే ఆధారపడి జీవిస్తున్నామని, తమ జీవనోపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న సీఐ శివశంకర్(CI Shivashankar attacks) అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్న మాదాల ఉపేందర్‌పై దాడికి దిగినట్లు ఆరోపణలు వచ్చాయి. అతడిని రోడ్డుపైకి నెట్టివేసి, లాక్కెళ్లి పోలీసు వాహనంలో పడేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అడ్డుకున్న మహిళలను సైతం తోసివేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తమపై దురుసుగా వ్యవహరించిన సీఐపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి న్యాయం చేయాలని కోరారు.






