28 August, 2026 | 3:20 PM

రాఖీ కట్టేందుకు వెళ్తుండగా ప్రమాదం.. మహిళకు తీవ్రగాయాలు

28-08-2026 02:26 PM

కూసుమంచి లో బైక్ ను ఢీకొన్న టిప్పర్..మహిళకు తీవ్ర గాయాలు…

కూసుమంచి, (విజయక్రాంతి): రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదరుడికి రాఖీ కట్టేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగి, సోదరి త్రీవంగా గాయపడిన సంఘటన శుక్రవారం చింతలతండా సమీపంలో  చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా, కూసుమంచి మండలం చేగొమ్మ క్రాస్ రోడ్ నుంచి పోచారం వెళ్లే మార్గంలో బైక్ ను టిప్పర్ ఢీ కొట్టింది. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న  దంపతుల్లో భార్యకు తీవ్ర గాయాలు. స్థానికులు ఆసుపత్రికి హాస్పిటల్ కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.