28 August, 2026 | 2:28 PM

Breaking News

రాఖీ కట్టేందుకు వెళ్తుండగా ప్రమాదం.. మహిళకు తీవ్రగాయాలు   •   ప్రధాని మోదీ, తల్లిదండ్రులపై ఫేస్‌బుక్‌లో అసభ్యకర పోస్ట్   •   ఎమ్మెల్యే పోచారంకు రాఖీ కట్టిన సోదరిమణి దొడ్ల సత్యవతి   •   విద్యుత్ పోరాట అమరవీరుల స్పూర్తితో భవిష్యత్ పోరాటాలు   •   ప్రయాణికుల కష్టాలు తీర్చేలా ఆర్‌ఓబీ పనులు వేగవంతం చేయాలి   •   సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రులు   •   మదర్‌ థెరిసా పొదుపు సమితిపై ఆరోపణల కలకలం   •   పేద విద్యార్థులకు డాక్టర్ సంతోష్ రెడ్డి ఆర్థిక సహయం   •   జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •  

ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు

28-08-2026 01:30 PM

ఆరోగ్య పరిస్థితిపై ఆరా, త్వరగా కోలుకోలుకుంటారని ధైర్యం చెప్పారు 

ముత్తారం, ఆగస్టు 28 (విజయక్రాంతి): ముత్తారం మాజీ జడ్పీటీసీ(Former Muttaram ZPTC) నాగినేని జగన్మోహన్‌రావు ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో ముత్తారం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయనను శుక్రవారం పరామర్శించారు. కరీంనగర్‌లోని జగన్మోహన్‌రావు స్వగృహానికి వెళ్లిన నాయకులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏఎంసీ డైరెక్టర్ బొల్లినేని బుచ్చంరావు, ముత్తారం  మాజీ సర్పంచ్ తాటిపాముల వకులరాణి–శంకర్, డా.చారి,  కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కోల విజయ్, గాదం శ్రీనివాస్ జగన్మోహన్‌రావును కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓరుగంటి రవీందర్‌రావు తదితరులు ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని దైర్యం చెప్పారు.