విప్లవానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ
నీలం మధు ముదిరాజ్
పటాన్ చెరు, ఆగస్టు 20 : ఆధునిక సాంకేతిక విప్లవానికి ఆద్యుడు, టెలికాం రంగంలో సరికొత్త సంస్కరణలు తెచ్చి భారతదేశాన్ని టెక్నాలజీలో పరుగులు పెట్టించిన మహా ఘనత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి దక్కుతుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ తెలిపారు. గురువారం రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని చిట్కుల్ లోని ఎన్‌ఎంఆర్ క్యాంపు కార్యాలయంలో రాజీవ్ గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ భారతదేశంలో డిజిటల్ విప్లవానికి నాంది పలికింది రాజీవ్ గాంధీ అని అన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీకి పెద్దపీట వేస్తూ పలు సంస్కరణలు తీసుకొని వచ్చి సాంకేతిక విప్లవాన్ని అభివృద్ధి దిశగా నడిపించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సంగన్నగారి గోపాల్, దస్తగిరి, మన్నే రాఘవేంద్ర, నారాయణదాసు, సంపత్, నాయకులు అశోక్, శ్రీనివాస్, వీరేష్, అనిల్, రాజ్ కుమార్, కాంగ్రెస్ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు






