28 March, 2026 | 4:10 PM

రాజాపూర్ తైబజార్ వేలం

28-03-2026 02:13 PM

రాజాపూర్ : మండల కేంద్రంలో ప్రతి సోమవారం నిర్వహించే వారంతపు సంత (తైబజార్ )వేలంపాటను శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎంపీవో వెంకట్ రాములు,సర్పంచ్ కావలి రామకృష్ణ, అధికారుల సమక్షంలో వేలం నిర్వహించారు. ఈ వేలంపాటలో రూ 2.36లక్షల కు మండల కేంద్రానికి చెందిన రాకేష్ సొంతం చేసుకున్నారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో సంత రోజు తిర్మలాపూర్ దిక్కు వెల్లు రోడ్డు ట్రాఫిక్ సమస్య చాలా ఏర్పడుతుంది. మండల కేంద్రం లో జాతీయ రహదారి పై బ్రిడ్జ్ నిర్మాణం పనులు జరుగుతున్నా క్రమంలో సంత కు ఎటువంటి సమస్యలు తలేత్తకుండా తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.