17 April, 2026 | 3:44 AM

అరైవ్ అలైవ్ ప్రచారంతో రహదారి భద్రతపై అవగాహన

17-04-2026 12:00 AM

కల్లూరు, ఏప్రిల్ 16 (విజయ క్రాంతి): అరైవ్ అలైవ్ ప్రచార కార్యక్రమాన్ని పురస్కరించుకుని కల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రహదారి భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కల్లూరులోని అంబేద్కర్ సెంటర్ వద్ద ఎస్త్స్ర హరిత ఆధ్వర్యంలో పోలీసులు, ప్రజాప్రతిని ధులు, గ్రామస్తులు కలిసి రహదారి భద్రత ప్రతిజ్ఞ చేశారు.

అనంతరం కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ మాట్లాడుతూ, రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన లోపం కారణంగా ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని తెలిపారు. రహదారి ఆక్రమణదారులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో కల్లూరు మున్సిపాలిటీ చైర్పర్సన్ ధరావత్ మోహన్ నాయక్,మున్సిపాలిటీ మేనేజర్ నందిశెట్టి నాగేశ్వరరావు, బీరవల్లి మాధవ్,స్థానిక ప్రజలు పాల్గొన్నారు.