2 September, 2026 | 11:22 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

రెండు రోజులపాటు వర్షాలు

06-07-2026 | 02:37am
  1. నేడు గంటకు 50 కి.మీ వేగంతో గాలులు
  2. ఏడు జిల్లాల్లో అక్కడక్కడ వానలు 

హైదరాబాద్, జూలై 5 (విజయక్రాంతి): రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు కురువనున్నాయి. తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బలమైన ఉపరితల గాలులు గంటకు 50 కి.మీ. వేగంతో వీస్తాయని తెలిపింది. దీంతోపాటు ఓ మోస్తరు వర్షాలు పడుతాయని పేర్కొంది. మంగళవారం ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

బంగాళఖాతంలో అల్పపీడనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ముసురు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. మరికొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి. సిద్దిపేట, హనుమకొండ, మహబూబాబాద్, వరంగల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల, మేడ్చల్, హైదరాబాద్‌తోపాటు మరికొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిశాయి. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను వాతావరణ కేంద్రం జారీ చేసింది.