18 July, 2026 | 12:33 AM

జిల్లాలో వర్షభావ పరిస్థితులు

18-07-2026 12:00 AM

రైతులకు ప్రత్యామ్నాయ పంటల సూచనలు

రంగారెడ్డి, జూలై 17 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లాలో జూన్ నెలలో సాధారణ వర్షపాతం న మోదైనప్పటికీ, జూలై లో వర్షాలు లేకపోవడంతో లోటు వర్షపా తం ఏర్పడింది. దీనివల్ల ఇప్పటికే మొలకెత్తిన విత్తనాలు ఎండిపోయే ప్రమాదం ఉందని జిల్లా ఇంచార్జి వ్యవసాయ అధికారి సుజాత తెలిపారు. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 3,94,762 ఎకరాలు కాగా, ఇప్పటివరకు 2,41,576 ఎకరాల్లో సాగైంది.

ఇంకా 1,53,186 ఎకరాల సాగు మిగిలి ఉంది.ఈ పరిస్థితుల్లో రైతులు నష్టపోకుండా ఉండేందుకు వ్యవసాయ శాఖ అధికారులు  సూ చనలు చేశారు. రైతులందరూ ప్రత్యామ్నా య పంటలు... స్వల్పకాలిక  కంది రకాలు, ఆముదం, బొబ్బర్లు, ఉలవలు, చిరుధాన్యా లు, మేత జొన్న వంటి పంటలను సాగు చేయాలన్నారు. ఎక్కువ నీరు అవసరమ య్యే వరికి బదులుగా బెండ, ఆకుకూరలు, అనుములు, టమాట, కొత్తిమీర వంటి స్వల్పకాలిక కూరగాయలు సాగు చేయడం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు.

వర్ష పు నీటిని నిల్వ చేసుకోవడానికి పొలాల్లో ఇంకుడు గుంతలు, ఫాంపాండ్స్ (పంట సం జీవని) తవ్వుకోవాలి. వీటిని ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేసుకోవచ్చు. (వివరాల కోసం వ్యవసాయ అధికారి లేదా ఎంపీడీవోను సంప్రదించాలి) జిల్లాలో ఎరువుల కొరత లేదు. ప్రభుత్వ పథకాల ప్రయో జనాలు పొందడం కోసం రైతులందరూ తప్పనిసరిగా ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ చేసుకోవాలి.