దేశానికి రాహుల్ క్షమాపణ చెప్పాలి
హైదరాబాద్: దేశానికి రాహుల్ గాంధీ(Rahul Gandhi) క్షమాపణ చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు(N. Ramachandra Rao) డిమాండ్ చేశారు. దేశ యువతను కాంగ్రెస్ పార్టీ తప్పుదోవ పట్టిస్తోందని ఆయన ఆరోపించారు. ఇంకా కొందరు మావోయిస్టులు లొంగిపోతే ఆపరేషన్ కగార్ పూర్తవుతోందని రామచందర్ రావు పేర్కొన్నారు. ప్రపంచంలో ఎర్రజెండా ఎక్కడా లేదని సూచించారు. అంతమైన కమ్యునిజాన్ని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), మాజీ సీఎం కేసీఆర్ బతికించాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
విద్యార్థులను అర్బన్ నక్సలైట్ల(Urban Naxalites) పాడుచేయొద్దని కోరారు. అర్బన్ నక్సలైట్లను కూడా అంతం చేస్తామని రామచందర్ రావు హెచ్చరించారు. వివిధ సామాజిక వర్గాలకు చెందిన పలువురు ప్రముఖులు బుధవారం నాడు రాష్ట్ర కార్యాలయంలో భారతీయ జనతా పార్టీలో(Bharatiya Janata Party) చేరారని రామచందర్ రావు ప్రకటించారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం సాధిస్తున్న అపూర్వ ప్రగతికి ఆకర్షితులై, పెద్ద ఎత్తున యువత దేశ సేవలో భాగస్వాములు కావడానికి ముందుకు రావడం అత్యంత హర్షణీయమని ఆయన పేర్కొన్నారు.




