21 July, 2026 | 6:48 PM

ప్రధాని మౌనం వీడాలి.. షా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి

21-07-2026 02:16 PM
  1. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి:
  2. ఇంత జరుగుతున్నా ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారు?

న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీలు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా(Lok Sabha Speaker Om Birla) ను కలిశారు. విద్యార్థులు తమ భవిష్యత్తుపై తీవ్ర ఆందోళనలో ఉన్నారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. భవిష్యత్తుపై ఆందోళనతో విద్యార్థులు నిరసిస్తే దాడులు చేశారని రాహుల్ గాంధీ వెల్లడించారు. విద్యార్థులపై దాడులు విషయమై పార్లమెంట్ లో చర్చించాలని రాహుల్ డిమాండ్(Rahul Gandhi) చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్(NEET question paper leak) వ్యవహారంపై పార్లమెంటులో చర్చించాలన్నారు. నీట్ పరీక్షల సంక్షోభానికి కేంద్రం పూర్తి బాధ్యత వహించాలని కోరారు.

రాహుల్ గాంధీ ఢిల్లీ ఆర్ఎంఎల్ ఆస్పత్రికి(RML Hospital) వెళ్లారు. జంతర్ మంతర్ వద్ద ఆందోళనల్లో గాయపడిన విద్యార్థులకు పరామర్శించారు. రాహుల్ గాంధీ వెంట ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ నేతలు ఉన్నారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కచ్చితంగా రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. నిరసనకారులపై దాడులకు ఆదేశించిన మంత్రి రాజీనామా చేయాలన్నారు. ఢిల్లీ ఘటనపై ప్రధాని మోదీ(Prime Minister Modi) కనీసం క్షమాపణ చెప్పలేదన్నారు. విద్య, పరీక్ష విధానాలపై యువత నిరసన తెలుపుతోందని రాహుల్ గాంధీ వెల్లడించారు.

విద్య, పరీక్ష వ్యవస్థలు భ్రష్టుపట్టాయని దేశమంతా తెలుసన్నారు. ఇంత జరుగుతున్నా ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారు? అని ప్రశ్నించారు. విద్యార్థులపై దాడి ఘటనపై ప్రధాని క్షమాపన చెప్పాలన్నారు. విద్యార్థులపై దాడులు చేసే అనాగరిక చర్యలు ఆపాలన్నారు. ధర్మేంద్ర ప్రధాన్(Dharmendra Pradhan) కచ్చితంగా రాజీనామా చేయాల్సిందేనని పునరుద్ఘాటించారు. నిన్నటి ఘటనకు బాధ్యత వహిస్తూ అమిత్‌షా రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.