సీఎం క్షమాపణలు చెప్పినా వదలం
జుబిన్ మృతి కేసు.. నిందితులకు వందరోజుల్లో శిక్ష
ఆరు సామాజిక వర్గాలకు ఎస్టీ హోదా
అస్సాం ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ
డీస్ఫూర్, ఏప్రిల్ 5: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం హిమంత బిశ్వశర్మను క్షమాపణలు చెప్పినా వదలబోమని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఆదివారం అస్సాంలోని బిశ్వనాథ్ చరియాలీలో నిర్వహించిన ప్రచార సభలో రాహుల్ ప్ర సంగించారు. దేశంలోనే అత్యంత అవినీతిపరుడైన సీఎం హిమంతగా అభివర్ణించా రు. జుబిన్ గర్గ్ తన జీవితాంతం ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు కృషిచేశారని, కాంగ్రెస్ భావజాలం కూడా అలాంటిదే అన్నారు.
ద్వేషానికి వ్యతిరేకంగా ప్రేమ ను పంచడమే కాంగ్రెస్ సిద్ధాంతమన్నారు. అధికారంలోకి వస్తే జుబిన్ మృతికేసులో నింది తులను వంద రోజుల్లోనే శిక్షిస్తామని రాహు ల్ గాంధీ హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ఆరు సామాజిక వర్గాలకు ఎస్టీ హోదా ఇస్తామని, తేయాకు కూలీలకు రోజుకు రూ.450 చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. సీఎం హిమంత నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ప్రజల్లో విద్వేషాన్ని వ్యాప్తి చేస్తుందని ఆరోపించారు. ఇక్కడి ప్రభుత్వాన్ని ఢిల్లీ నుంచి నియంత్రిస్తున్నారని రాహుల్ ఆరోపించారు.




