6 April, 2026 | 3:37 PM

కాల్పుల విరమణ దిశగా ఇరాన్, అమెరికా

06-04-2026 01:55 PM

టెహ్రాన్: ఇరాన్, అమెరికా కాల్పుల(Iran, US Ceasefire) విరమణ దిశగా సాగుతున్నాయి. 45 రోజుల పాటు కాల్పుల విరమణకు ప్రతిపాదనలు వెలువడ్డాయి. సోమవారం నుంచి హర్మూజ్ జలసంధిని తెరవాలని అమెరికా ప్రతిపాదించింది. యుద్ధానికి శాశ్వత ముగింపు పలికే అవకాశం ఉన్న 45 రోజుల కాల్పుల విరమణ షరతులపై అమెరికా, ఇరాన్‌ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాల్పుల విరమణకు పాకిస్థాన్ , తుర్కియే, ఈజిప్ట్ ప్రతిపాదనలు చేశాయి. పాకిస్థాన్ , తుర్కియే, ఈజిప్ట్ తమ ప్రతిపాదనలను అమెరికా, ఇరాన్ కు పంపాయి. ప్రతిపాదనలపై అమెరికా, ఇరాన్ నిర్ణయం తీసుకోనున్నాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) రాయబారి, ఇరాన్ విదేశాంగమంత్రి మధ్య చర్చలు జరుగుతున్నాయి. సానుకూలంగా ఫలితం వెలువడవచ్చని అమెరికా మీడియా భావిస్తోంది. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో 17 మంది మృతి చెందారు. టెహ్రాన్ నైరుతి ప్రాంతంలోని భవనంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ కు డెడ్ లైన్ గడువును మరోసారి పొడిగించారు. డెడ్ లైన్ ను బుధవారం ఉదయం వరకు పొడిగించినట్లు ట్రంప్ వెల్లడించారు. హార్మూజ్ జలసంధిని వెంటనే తెరవాలని ఇరాన్ ను ఇప్పటికే పలుమార్లు ట్రంప్ హెచ్చరించారు.