21 May, 2026 | 3:17 PM

Breaking News

తెల్ల తెల్లవారుతుండగానే పల్లెల్లోకి పాఠశాలల ప్రచారం.. విత్తన కంపెనీల ప్రచార రతాలు   •   ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి ఒక్కరికి క్రీడలు అవసరం   •   ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి..   •   ఆరోగ్యం బాగుంటేనే జీవితం సార్థకం   •   ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్   •   అనుమతి లేని ప్రైవేట్, విద్యాసంస్థలను మూసివేయాలి   •   కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టెన్త్ టాపర్ కు సైకిల్ బహుకరణ...   •   జైనూర్‌లో చలివేంద్రం – అంబలి పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   బాన్సువాడలో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు...   •   ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు   •  

రాధాకృష్ణచారికి మహానంది పురస్కారం

26-01-2026 01:34 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 25(విజయక్రాంతి): జిల్లా కేంద్రానికి చెందిన కవి, రచయిత, జర్నలిస్ట్ చిలుకూరి రాధాకృష్ణ చారికి మహానంది పురస్కారం లభించింది. తెలుగు ఇండియన్ కల్చర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ కాళోజీ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు వెలుగు సాహితీ వేదిక సంయుక్త ఆధ్వర్యంలో స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన 2026 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం వరంగల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా సాహిత్య, పత్రికా సేవ రంగాల్లో రాధాకృష్ణ చారి అందించిన విశిష్ట సేవలను గుర్తించి మహానంది పురస్కారంతో సత్కరించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వరంగల్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ప్రముఖ హాస్య నటుడు ఆర్.ఎస్. నంద చేతుల మీదుగా జ్ఞాపిక, ప్రశంసా పత్రం అందజేసి శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.