4 May, 2026 | 9:08 PM

నాణ్యమైన విత్తనాలను వాడాలి

04-05-2026 07:46 PM

ములకలపల్లి, (విజయక్రాంతి): అధిక దిగుబడుల కోసం రైతులు నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి అరుణ్ బాబు సూచించారు.“ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం ములకలపల్లి మండలంలోని ములకలపల్లి, పూసుగూడెం, జగన్నాధపురం,పొగళ్లపల్లి రైతు వేదికలలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేల ఆరోగ్య పరిరక్షణ, మట్టి నమూనా సేకరణ, భూసార హెల్త్ కార్డు, సమతుల ఎరువుల వినియోగం, నానో యూరియా, డి ఏ పి  ఉపయోగాలు,సహజ వ్యవసాయం,నాణ్యమైన విత్తనాల వినియోగం,వానాకాలానికి వరిలో ఎంపిక చేయబడిన రకాలు అనే అంశాలపై రైతులకు శాస్త్రీయ పద్ధతుల్లో అవగాహన కల్పించారు.