రైతు ముంగిట్లో నాణ్యమైన విత్తనాలు
కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా
అయిజ, జూన్ 23: అయిజ మున్సిపాలిటీ లో రైతు విస్తరణ వ్యవసాయ కేంద్రం నందు ఏఈఓ జనార్దన్ ఆధ్వర్యంలో జరిగిన రైతు వేదిక సదస్సులో కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ మార్పుల వల్ల ఎలినినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా కురువొచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. కావున వర్షాధారిత పంటలు జొన్న, పెసర, కొర్రలు, కందులు మొదలగు పంటలు వేసుకోవాలని అన్నారు.
మరియు ప్రమాదకర రసాయనిక ఎరువుల వాడకం వల్ల మనుషుల్లో ప్రాణాపాయకర వ్యాధులు వస్తున్నాయని కావున పంటలకు జ్ఞానో యూరియా వాడాలని,ఇప్పుడు యుద్ధ ప్రభావాల వల్ల ప్రస్తుతం ప్రభుత్వం ఎకరాకు రెండు బస్తాల యూరియా మాత్రమే ఇస్తుందని దానివల్ల పంటలకు తక్కువ పెట్టుబడి ఎక్కువ దిగుబడి వస్తుందని అన్నారు. అనంతరం ఆయన యూరియా యాప్ (అయిజ, వడ్డేపల్లి )లను విడుదల చేశారు. మండల తాసిల్దార్ జ్యోతి, ఎంపీడీవో భాస్కర్, వ్యవసాయ విస్తరణ అధికారి జనార్ధన్, మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ మొదలగు అధికారులు రైతును పాల్గొన్నారు.






