హైదరాబాద్ లో పీవీఆర్ ఐనాక్స్ కొత్త 8- స్క్రీన్ ప్రారంభం
ఫిబ్రవరి 26, 2026: ప్రముఖ మల్టిప్లెక్స్ ఆపరేటర్ పీవీఆర్ ఐనాక్స్ హైదరాబాద్ ఒడియన్ మాల్ లో కొత్త స్క్రీన్ ను ప్రారంభించింది. 8 స్క్రీన్లతో ప్రేక్షకులకు సరికొత్త అనుభవాన్ని అందించేందుకు తీసుకొచ్చింది. దీంతో హైదరాబాద్ లో పీవీఆర్ ఐనాక్స్ మొత్తం స్క్రీన్ల సంఖ్య 119క చేరింది. మూవీ థియేటర్స్ కు కేరాఫ్ అడ్రస్ గా చెప్పే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో దీనిని ప్రారంభించారు.
ఈ కొత్త స్కీన్స్ సముదాయంలో మొత్తం 1402 సీట్ల సామర్థ్యంతో నాణ్యతతో కూడిన వీక్షణ అనుభవం అందించనున్నట్టు పీవీఆర్ ఐనాక్స్ నిర్వాహకులు తెలిపారు. రెండు 4K ప్రొజక్టర్లు మరియు లేజర్ ఫాస్ఫర్ ప్రొజెక్టర్ తో ఆధునిక ప్రొజెక్షన్ వ్యవస్థ సినిమాకు ఉండి, మెరుగైన కాంతి మరియు ఇమేజ్ స్పష్టతతో ఆధునిక రిజల్యూషన్ ను అందిస్తోంది. ఆధునిక 3D సాంకేతికతతో డాల్బీ అట్మోస్ సౌండ్ తో స్పష్టమైన దృశ్యాలు మరియు లీనమయ్యే ఆడియోను అందిస్తుంది.
సెలబ్రిటి రిక్లైనర్స్ సహా ప్రీమియం సీటింగ్ ఎంపికలు ప్రేక్షకులకు లగ్జరీ సౌకర్యాన్ని అందిస్తాయని వీపీఆర్ తెలిపింది. హైదరాబాద్ ఎల్లప్పుడూ భారతదేశంలో అత్యంత ఆకర్షణీయమైన సినిమా మార్కెట్లలో ఒకటిగా నిలిచిందనీ పీవీఆర్ ఐనాక్స్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ బిజ్లీ తెలిపారు. అలాగే లేఅవుట్, ఇంటీరియర్స్ నుండి టెక్నాలజీ, సౌకర్యం వరకు, నిజమైన సినిమా ప్రేమికులను ఆకర్షించడానికి ప్రతి అంశంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టు పీవీఆర్ ఐనాక్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ కుమార్ బిజ్లీ వెల్లడించారు.




