హైదరాబాద్ లో ఆసుస్ స్పెషల్ స్టోర్
హైద్రాబాద్: దేశమంతటా తన బ్రాండ్ యొక్క రిటైల్ ముద్రను బలపరుచుకునే దిశగా ఆసుస్ ఇండియా అడుగులు వేస్తోంది. తైవాన్ కు చెందిన ఈ టెక్ దిగ్గజం తాజాగా హైద్రాబాద్‌లో కొత్త ప్రత్యేకమైన స్టోర్ ప్రారంభించింది.. ఈ కొత్త ప్రత్యేకమైన స్టోర్ 350 చదరపు అడుగుల విస్తిర్ణంలో ఉంది. విస్తారమైన ఎలక్ట్రానిక్స్ మరియు కంప్యూటర్ హార్డ్‌వేర్, వివోబుక్, జెన్‌బుక్, రిపబ్లిక్ ఆఫ్ గేమ్‌ర్స్ (ROG) ల్యాప్‌టాప్స్, గేమింగ్ డెస్క్‌టాప్స్, ఆల్-ఇన్-వన్ డెస్క్‌టాప్స్, ఇతర ఉపకరణాల వంటి ఫ్లాగ్‌షిప్ ఉత్పత్తులతో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో ఆసుస్ బ్రాండ్ యొక్క 17వ ప్రత్యేకమైన స్టోర్ ఇది. ఈ సందర్భంగా ఆసుస్ బ్రాండ్ విస్తరణ గురించి పర్సనల్ కంప్యూటర్ , గేమింగ్ బిజినెస్జాతీయ సేల్స్ మేనేజర్ జిగ్నేష్ బశవర్ పలు విషయాలు పంచుకున్నారు. ఇండియాలో తమ రిటైల్ ముద్రను విస్తరణ ప్రకటించడానికి తాము ఎంతో సంతోషిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణా తమకు చాలా ముఖ్యమైన మార్కెట్‌గా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా హైద్రాబాద్ నగరంలో కొత్త బ్రాండ్ స్టోర్ ప్రారంభం దేశంలోని వివిధ ప్రాంతాలంతటా వినియోగదారుల సాధికారత దిశగా అడుగులు వేస్తున్నట్టు వెల్లడించారు. ఒక వ్యూహాత్మక రిటైల్ విస్తరణతో యుజర్స్‌కి మరింత ఇంటరాక్షన్ మరియు కొత్త టచ్‌పాయింట్స్‌ని అందించేలా సేవలు ఉంటాయని తెలిపారు.




