25 June, 2026 | 1:47 PM

Breaking News

ఓటరు జాబితా సవరణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   సీసీరోడ్డు పనుల్లో నాణ్యతా ప్రమాణాల లోపం   •   మంగనూర్ వాసి దారుణ హత్య   •   నిజాంసాగర్ పోలీసుల ఆధ్వర్యంలో ముమ్మర వాహన తనిఖీలు   •   SIR ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్   •   గట్ల గౌరవరం గ్రామంలో వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   నాగర్‌ కర్నూల్ నూతన ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా వేణుగోపాల్ రెడ్డి   •   తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లు ప్రారంభం   •   డిజిటల్ అరెస్ట్ ముఠాలపై ఉక్కుపాదం.. 16 రాష్ట్రాల్లో సీబీఐ సోదాలు   •   కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌తో ముగ్గురు సీఎంల భేటీ   •  

కొనుగోళ్లు వేగవంతం చేయాలి

29-04-2026 12:47 AM

అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి 

చిగురుమామిడి, ఏప్రిల్ 28(విజయక్రాంతి): ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి నిర్వాహకులను ఆదేశించారు. చిగురు మామిడి మండలంలోని చిగురుమామిడి బొమ్మనపల్లి సుందరగిరి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను అడిషనల్ కలెక్టర్ (రెవిన్యూ) బీ శ్రీనివాస్ రెడ్డి మంగళవారం ఆకస్మికంగా కేంద్రాలను పరిశీలించి నిర్వాహకులతో మాట్లాడారు.

కేంద్రాలలో నిలువ ఉన్న ధాన్యం నిలువలను వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని నిర్వాహలను ఆదేశించారు.కొనుగోళ్లు చేసిన ధాన్యాన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేసి ట్రాక్టర్ల ద్వారా రైస్ మిల్లులకు పంపించాలని ఆదేశించారు. రైస్ మిల్లర్లతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని వారికి సూచించారు. రైతుల ధాన్యం ఎట్టి పరిస్థితుల్లో నిల్వ ఉండకూడదని సూచించారు. వర్షాలు పడితే రైతుల ధాన్యం తడవకుండా టర్పాలిన్లు సెంటర్లో అందుబాటులో ఉంచాలని సూచించారు.

ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున రైతులు ఉండేందుకు నీడ వసతి తో పాటు తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. ట్రాక్టర్లలో తరలించిన ధాన్యాన్ని ఇబ్బందులు లేకుండా మిల్లర్లతో మాట్లాడతారని అన్నారు. వీరి వెంట తహసీల్దార్ ముద్దసాని రమేష్, ఏపీఎం శ్రీనివాస్, సీసీలు రవీందర్, సత్యనారాయణ, సెంటర్ నిర్వాహకులు ఉన్నారు.