12-02-2026 12:17:26 AM
మెదక్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిలో 81.09శాతం పోలింగ్ నమోదు...
86109 మంది ఓటర్లకు గాను 69824 మంది ఓటేశారు..
మెదక్ లో 80.75 శాతం, తూప్రాన్ లో 81.30 శాతం, నర్సాపూర్ లో 73.61 శాతం, రామాయంపెట్ లో 84.84 శాతం
నర్సాపూర్ లో బీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత
రామాయంపెట్ ఏడో వార్డులో ఇరువర్గాల మధ్య ఘర్షణ
మెదక్, ఫిబ్రవరి 11(విజయ క్రాంతి) :మెదక్ జిల్లాలో మున్సిపల్ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 5 గంటల వరకు 81.09 శాతం పోలింగ్ నమోదైంది. చెదురు ముదు రు సంఘటనల మధ్య పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని నాలుగు ము న్సిపాలిటీ పరిధిలోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓటర్లు ఉదయం 7గంటల నుంచే ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ లకు తరలివచ్చారు. సామాన్యులతో పాటు పలువురు ప్రముఖులు త మ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 11 గంటల వరకు పోలింగ్ మందకొడిగా సాగగా 35.94 శాతం నమోదు కా గా మెదక్ లో 35.64 శాతం, రామాయంపేటలో 38.27 శాతం, తుప్రాన్ లో 35.94 శా తం, నర్సాపూర్ లో 34.09 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 1 గంట వరకు 57.88 శాతం పోలింగ్ నమోదు కాగా,
మె దక్ లో 57.84 శాతం, రామాయంపేట లో 60.79 శాతం, తుప్రాన్ లో 57. 7 శాతం, నర్సాపూర్ లో 55.93 శాతం నమోదైంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 71.65 శాతం పోలింగ్ నమోదు కాగా, మెదక్ లో 71.31 శాతం, రామాయంపేట లో 76.11 శాతం, తూప్రాన్ లో 71. 50 శాతం, నర్సాపూర్ లో 69.10 శాతం పోలింగ్ నమోదైంది. 5 గం టల వరకు 81.09 శాతం పోలింగ్ నమోదైంది.
రామాయంపేటలో ఉద్రిక్తత...
రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని ఏడవ వార్డులో బుధవారం ఉద్రిక్త పరి స్థితి నెలకొంది. బీజేపీ అభ్యర్థి తరఫున డబ్బులు పంచుతున్నారని, ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు వార్డులో తిరుగు తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచే సుకుంది. నిబంధనలకు విరుద్ధంగా వార్డు లో సంచరిస్తున్న బయటి ప్రాంతాల వ్యక్తులను గుర్తించిన పోలీసులు వారిని అక్కడి నుంచి బలవంతంగా పంపించి వేశారు.
నర్సాపూర్ లో బీఆర్‌ఎస్ బీజేపీ నేతల మధ్య ఘర్షణ..
నర్సాపూర్ మున్సిపాలిటీలోని 15వ వార్డులో బీఆర్‌ఎస్, బీజేపీ నేతల మధ్య ఘర్షణ నెలకొంది. మంగళవారం రాత్రి 4, 5, 10, 11వ వార్డుల్లో పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరగ్గా.. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో 15వ వార్డులో బీఆర్‌ఎస్ కార్యకర్తలపై బీజేపీ నేతలు దాడికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టి, అక్కడి నుంచి పంపించేశారు. ఈ క్రమంలో ఎలాం టి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.
ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా కలెక్టర్ దంపతులు
మున్సిపల్ ఎన్నికల పోలింగ్లో భాగంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బుధవా రం జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ గాంధీనగర్ వార్డ్ నెంబర్ -18 పోలింగ్ స్టేషన్ నెంబర్ 35 వద్ద కలెక్టర్ దంపతులు సామా న్య ఓటరుల్లా వరుసలో నిలబడి ఓటు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైనదని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఓటరు తమ ఓటు హక్కును తప్పనిసరిగావినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
వంద శాతం ఓటింగ్ జరగాలి: సాధారణ పరిశీలకులు రవి కిరణ్
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పక్రియ ప్రశాంతంగా జరుగుతున్నట్లు సాధారణ పరిశీలకులు రవి కిరణ్ స్పష్టం చేశారు. బుధవా రం మెదక్ మున్సిపల్ పరిధిలో ఉన్న పలు వార్డులలో, పోలింగ్ కేంద్రలలో విస్తృతంగా పర్యటించి పరిశీలించారు. పోలింగ్ సిబ్బందిని, పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటర్లను ఓటింగ్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటూ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సాధారణ పరిశీలకులు రవి కిరణ్ మాట్లాడుతూ.. మెద క్ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు.
మెదక్ జిల్లా మున్సిపల్ ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొని మెదక్ మున్సిపాలిటీలో వంద శాతం ఓటింగ్ జరగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, మెదక్ ఆర్డీవో రమాదేవి, డి ఎస్ పి ప్రసన్న కుమార్, మెదక్ తహసిల్దార్ లక్ష్మణ్ బాబు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
మెదక్ మున్సిపాలిటీ పరిధిలో పోలింగ్ కేంద్రాల పరిశీలన : జిల్లా ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు
మెదక్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద బజార్, పిట్లం బేస్, నవాబ్ పేట్, గరల్స్ హై స్కూల్, గోల్కొండ విధి, ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను మెదక్ జిల్లా ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు పరిశీలించారు. పోలింగ్ కేం ద్రాల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లు, పోలీస్ బందోబస్తు, స్ట్రైకింగ్ ఫోర్స్ మోహరింపు, క్యూలైన్ నిర్వహణ తదితర అంశాలను సమగ్రంగా సమీక్షించారు. విధు ల్లో ఉన్న పోలీస్ సిబ్బందితో మాట్లాడి అవసరమైన సూచనలు చేశారు. ఓటర్లు ఎటు వంటి భయాందోళనలు లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
నర్సాపూర్‌లో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన:అదనపు ఎస్పీ మహేందర్..
బుధవారం నర్సాపూర్ పట్టణంలోని ప్ర భుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ పరిశీలించారు. ఎన్నికల నిర్వహణ కొనసాగుతున్న తీరును, పోలింగ్ కేంద్రంలో అమ లు చేస్తున్న భద్రతా ఏర్పాట్లను ఆయన స మీక్షించారు. ఈ సందర్భంగా పోలింగ్ సి బ్బందితో మాట్లాడి, ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ పారదర్శకంగా విధులు నిర్వహించాలని సూచించారు.
పోలింగ్ కేం ద్రం పరిసర ప్రాంతాల్లో భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలను సహించబోమని అదనపు ఎస్పీ హెచ్చరించారు. ఎన్నికలు ప్ర శాంత వాతావరణంలో జరిగేలా పోలీసులు పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.