అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కావాలి
కౌన్సిలర్ కోలా ఉదయభాను ఆధ్వర్యంలో పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లుకు ఆత్మీయ సన్మానం
హుజూర్ నగర్, మే 18: అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలని రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగల వెంకటేశ్వర్లు కోరారు. ఇటీవల రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నికైన దొంగరి వెంకటేశ్వర్లును సోమవారం మున్సిపల్ కౌన్సిలర్ కోలా ఉదయభానుఉపేందర్ ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సహకారంతో ప్రగతి పనులు పూర్తి చేస్తామని అన్నారు.
హుజూర్ నగర్ నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయలతో ఉత్తంకుమార్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. దేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడ లేని విధంగా పేదలకు ఉచితంగా సన్నబియ్యం అందిస్తున్నా ఘనత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికే దక్కిందన్నారు.సన్న బియ్యంతో పేదల కుటుంబాల్లో వెలుగులు నిండినాయన్నారు.ప్రతి పేద కుటుంబం సన్న బియ్యం తింటూ సంతోషంగా గడుపుతున్నారని అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం,మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బడుగు బలహీన వర్గాలకు రాజకీయ ప్రాథమిక ఇస్తున్నారని అన్నారు. ప్రభుత్వానికి అన్ని వర్గాల ప్రజలు అండగా ఉండాలని పిలుపు నిచ్చారు.కార్యక్రమంలో నాగేశ్వరరావు,ధనుంజయ్, పోతుల జ్ఞానయ్య,పోటు ఉపేందర్,పాలడుగు రాజు, గొట్టముకుల రాములు, బండి భాస్కర్ గొర్రె వీరబాబు, తుమ్మ అరుణ్ కుమార్ పాల్గొన్నారు.






