10 March, 2026 | 7:27 AM

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

10-03-2026 12:08 AM

కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

సూర్యాపేట, మార్చి 9 (విజయక్రాంతి): ప్రజావాణి పిర్యాదులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశం మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని, వివిధ శాఖలలో చాలా కాలం పెండింగ్ లో ఉన్న పిర్యాదులపై శాఖల వారీగా ప్రత్యేక శ్రద్ద పెట్టి పరిష్కరించాలన్నారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక లో భాగంగా కలెక్టరేట్ లోని ప్రతి కార్యాలయం పరిశుభ్రంగా ఉంచుకోవాలని అలాగే ప్రతి కార్యాలయంలోని ఫైల్స్ అన్ని సక్రమంగా ఉంచుకోవాలని ప్రతి కార్యాలయ సిబ్బంది అటెండెన్స్ తప్పనిసరిగా ఫేస్ రికగ్నేషన్ యాప్ లో నమోదు చేయాలన్నారు.

లేనిపక్షంలో చర్యలు తప్పు అన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భూ సమస్యలకి సంబందించి 24 దరఖాస్తులు, జిల్లా పంచాయతీ అధికారి 5, డి ఆర్ డి ఏ  8,  వైద్య ఆరోగ్య శాఖ అధికారి 3,   మిగిలిన 41 దరఖాస్తులు వివిధ శాఖలకి చెందినవని మొత్తం 83 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ కే. సీతారామారావు,  జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ రెడ్డి, డిఇఓ అశోక్, సంక్షేమ అధికారులు నర్సింహారావు, నరసింహ, శంకర్ జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.