17 April, 2026 | 10:25 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ఫైర్ సేఫ్టీపై ప్రజల్లో అవగాహన పెంచాలి

14-04-2026 06:14 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజల్లో విస్తృత చైతన్యం కలిగించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు.  అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు జరగనున్న వారోత్సవాలను సమర్థవంతంగా, ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అగ్నిప్రమాదాల నివారణలో ముందస్తు జాగ్రత్తలు అత్యంత కీలకమని తెలిపారు.

విద్యాసంస్థలు, ఆసుపత్రులు, పెట్రోల్ బంకులు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, జనసంచారం అధికంగా ఉండే ప్రదేశాలలో అగ్నిమాపక పరికరాలు తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. ప్రజల్లో ఫైర్ సేఫ్టీపై అవగాహన పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి ప్రభాకర్, అధికారులు శివాజీ తదితరులు, సిబ్బంది పాల్గొన్నారు.