21 July, 2026 | 7:47 PM

Breaking News

రేపు సామూహిక గాయత్రి మంత్ర జప యజ్ఞం   •   జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి   •   అమ్మ నగర్ బ్రిడ్జితో దూరభారం తగ్గుతుంది   •   నీట్ పరీక్ష పత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేయాలి   •   జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి అదృశ్యం   •   సీజనల్ వ్యాధులు ప్రబలకుండా విస్తృత అవగాహన   •   సుల్తానాబాద్ మున్సిపాలిటీ 17 బూతుల బిఎల్ఎ 2 ల సమావేశం   •   ఫోటో, వీడియో గ్రాఫర్ల కు అండగా ఉంటాం: మేయర్ కొలగాని   •   ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియలో వేగం పెంచాలి   •   సర్పంచ్ పగడాల రమాదేవి అధ్వర్యంలో తడి–పొడి చెత్త బుట్టల పంపిణీ   •  

ప్రజాస్వామ్య హక్కులపై ప్రజల్లో అవగాహన కల్పించాలి

21-07-2026 03:59 PM

- అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ

అచ్చంపేట: ప్రత్యేక ఓటర్ల నమోదు సర్ ప్రక్రియపై అచ్చంపేట ఎమ్మెల్యే, టీపీసీసీ ఉపాధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు డాక్టర్ వంశీకృష్ణ జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల ఎంపీడీఓలు, డిఏల్పిఓలు, బిఎల్ఏ సూపర్వైజర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... అచ్చంపేట నియోజకవర్గంలో ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు ప్రజాస్వామ్య హక్కులపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యమని, కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా క్షేత్రస్థాయిలో పనిచేసి సర్ ప్రక్రియను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.