సమగ్ర శిక్ష ఉద్యోగుల, కేజీబీవీ ఉద్యోగుల నిరసన
09-03-2026 09:11 PM
లక్ష్మణ చందా,(విజయక్రాంతి): టీఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో మూడు దశల్లో పోరాటానికి సిద్ధమయ్యారు.దశల వారి పోరాటంలో భాగంగా నేడు లక్ష్మణ చందా మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. 16వ తేదీ నిర్మల్ డివిజన్ కేంద్రం లో నిరసన కార్యక్రమాన్ని అలాగే 20వ తేదీన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ నిర్మల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాసరి శంకర్ ,పెంట అశోక్, స్పెషల్ ఆఫీసర్ నవిత, పిజి సిఆర్టి సి ఆర్ టి ఎంఆర్సి సిబ్బంది పాల్గొన్నారు




