1 August, 2026 | 1:23 AM

80 మంది బాలబాలికల రక్షణ

01-08-2026 12:21 AM

యజమానులపై కేసులు నమోదు

ఉప్పల్, జూలై 31 (విజయక్రాంతి): బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన లక్ష్యంగా నిర్వహిస్తున్న ఆపరేషన్ ముస్కాన్-12లో ఉప్పల్ సబ్ డివిజన్ పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించి 80 మంది బాలబాలికలను గుర్తించి రక్షించారు.

మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఉప్పల్ సబ్ డివిజన్ ఏసీపీ వై. వెంకట్ రెడ్డి, ఉప్పల్ ఇన్స్పెక్టర్ వై. రామలింగారెడ్డి పర్యవేక్షణలో, ఎహెచ్టీయూ ఎల్బీ నగర్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో టీమ్ ఇన్చార్జ్ కె. ఇద్దయ్య నేతృత్వంలోని రెస్క్యూ బృందం ఈ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది.

చైల్ లేబర్, చైల్ మ్యారేజ్ వంటి కేసులను గుర్తించి, బాలబాలికలను రక్షించడంతో పాటు సంబంధిత యజమానులపై చట్టపరమైన చర్యలు చేపట్టారు. బాల కార్మికులను పనుల్లో నిమగ్నం చేసిన యజమానులపై కేసులు నమోదు చేసి, బాలల హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకున్నారు.ఆపరేషన్ ము స్కాన్లో భాగంగా ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 15 ఎఫ్‌ఐఆర్లు, 21 జీడీలు, నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో 9 ఎఫ్‌ఐఆర్లు, 14 జీడీలు, కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో 5 ఎఫ్‌ఐఆర్లు, 6 జీడీలు నమోదు అయ్యా యి. మొత్తం 80 మంది బాలురు, బాలికలు గుర్తించి రక్షించబడ్డారు.

రక్షించబడిన బాలబాలికలను చైల్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ ఎ దుట హాజరుపరచగా, కేసుల తీవ్రతను బట్టి సంబంధిత యజమానులు ఒక్కో బాలుడి పేరిట రూ.18,000 నుంచి రూ.40,000 వరకు డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో కలెక్టరేట్‌లో జమ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు పోలీసు శాఖతో పాటు బాలల సంక్షేమ విభాగం సమన్వయంతో చేపట్టిన ఈ చర్యలు బాలల భవిష్యత్తుకు దో హదపడతాయని అధికారులు పేర్కొన్నారు.