28 March, 2026 | 9:19 PM

కాంట్రాక్ట్ కార్మికుల పనివేళలో మార్పులు చేయాలి: యర్రగాని కృష్ణయ్య

28-03-2026 07:12 PM

ఎండల తీవ్రత నుండి రక్షణ కల్పించాలి

కొత్తగూడెం,(విజయక్రాంతి): సింగరేణిలో పనిచేస్తున్న సివిల్,కాంట్రాక్ట్ కార్మికులకు తీవ్ర ఎండల నేపథ్యంలో పని వేళల్లో మార్పులు చేయాలని, కార్మికులకు మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ను సప్లై చేయాలని, రక్షణ చర్యలు చేపట్టాలని సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్-ఏఐటియుసి కొత్తగూడెం, రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య డిమాండ్ చేశారు. శనివారం కొత్తగూడెం కార్పొరేట్ పరిధిలోని హాస్పటల్ ఏరియా తోపాటు, ఇతర కాంట్రాక్ట్ కార్మికుల పని ప్రదేశాల్లో కాంట్రాక్ట్ కార్మికుల తో కలిసి నిరసన తెలియజేశారు.

గత కొన్ని రోజుల నుండి ఎండలు తీవ్రంగా పెరగడంతో కాంట్రాక్ట్ కార్మికులు మిట్ట మధ్యాహ్నం రోడ్లపై పనులు చేస్తూ తీవ్ర అస్వస్థకు గురి అవుతున్నారని, ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్త పరిచారు.తక్షణమే సింగరేణి యాజమాన్యం దీనిపై స్పందించాలని, రక్షణ చర్యలతో పాటు పనివేళ్లలో ప్రతి సంవత్సరం లాగా మార్పులు చేసి విధులకు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎం చంద్రశేఖర్, సంజీవరావు, రమణ, అప్పారావు, లక్ష్మి, కృష్ణవేణి, పద్మ, సుశాంత్, రామకృష్ణ, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.