29 March, 2026 | 2:48 AM

రూ.4 లక్షల విలువైన సొత్తు రికవరీ

29-03-2026 12:52 AM
  1. రూ. 4 లక్షల విలువైన సొత్తు రికవరీ
  2. వివరాలు వెల్లడించిన సైఫాబాద్ సీఐ సీతయ్య

ఖైరతాబాద్,మార్చి 28(విజయక్రాంతి): తమిళనాడుకు చెందిన ఓ మహిళ తను ప్రయాణించిన ఆటోలో హ్యాండ్ బ్యాగ్ మరచిపోయారు. దాంట్లో విలువైన వస్తువులు ఉండటంతో ఆందోళన చెంది సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేవలం 30 నిమిషాల్లోనే హ్యాండ్ బ్యాగ్ రికవరీ చేసి మహిళకు అందజేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను స్టేషన్ సీఐ సీతయ్య శనివారం వెల్ల డించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకా రం తమిళనాడుకు చెందిన మణిమేగల అనే మహిళ మార్చి 27 రాత్రి లక్డీకాపూల్ మెట్రో స్టేషన్ వద్ద తను ప్రయాణించిన రాపిడో ఆటోలో పొరపాటున తన హ్యాండ్బ్యాగ్ను మర్చిపోయారు.

ఆ బ్యాగులో 25 గ్రాముల బంగారు గాజులు, బంగారు కమ్మలు, రూ. 30,000 నగదుతో పాటు ముఖ్యమైన ప త్రాలు ఉన్నాయి. వాటి మొత్తం విలువ సుమారు 4 లక్షల రూపాయలు ఉన్నాయని మహిళా పేర్కొందన్నారు. విలువైన సొత్తు పోగొట్టుకోవడంతో ఆందోళన చెందిన ఆమె వెంటనే పోలీసులను ఆశ్రయించారన్నారు. బాధితురాలి ఫిర్యాదుపై తక్షణమే స్పందిం చి, స్టేషన్ క్రైమ్ టీమ్ సభ్యులైన హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ రాజు, కానిస్టేబుల్ సురేష్ గౌడ్లను రంగంలోకి దించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని, రాపిడో సంస్థ అందించిన వివరా లను ఉపయోగించి కేవలం కొద్ది నిమిషాల్లోనే ఆటో డ్రైవర్ చాదర్ఘాట్ పరిధిలో ఉన్నట్లు గుర్తించామన్నారు.

వెంటనే అక్కడికి చేరుకున్న క్రైమ్ టీమ్ సభ్యులు డ్రైవర్ వద్ద ఉన్న హ్యాండ్బ్యాగ్ను అందులోని సొత్తును స్వాధీనం చేసుకొని రికవరీ చేసిన నగదు, బంగారు ఆభరణాలు అన్నీ భద్రంగా ఉన్నాయని నిర్ధారించుకున్నారని తెలిపారు. అనం తరం వాటిని బాధితురాలికి అందజేశామని వెల్లడించారు. ఫిర్యాదు అందిన కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేసి, తన సొత్తును తిరిగి అప్పగించిన సైఫాబాద్ పోలీసుల పనితీరును, సత్వర స్పందనను మణిమేగల కొనియాడుతూ కృతజ్ఞతలు తెలిపారు.