29 March, 2026 | 2:43 AM

నోటి క్యాన్సర్‌పై అవగాహన మారథాన్

29-03-2026 12:54 AM

మారథాన్ వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి జీ. కిషన్‌రెడ్డి

ముషీరాబాద్, మార్చి 28 (విజయక్రాంతి): గుట్కా, పాన్ మసాలా, ఖైనీ, తం బాకు, మద్యం వంటి వ్యసన పదార్థాల వినియోగం వల్ల ముఖ్యంగా యువత ఆరోగ్యప రంగా తీవ్రమైన ప్రమాదాలకు గురవుతూ తమ భవిష్యత్తును సంక్షోభంలోకి నెట్టుకుంటున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జీ. కిషన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దేశానికి యువతే శక్తి మూలాధారమన్నారు. అలాంటి యువశక్తి ఎటువంటి మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని ఆయ న పిలుపునిచ్చారు.

యువతలో ఆరోగ్య చైత న్యం పెంపొందించడం అత్యవసరమని, ఇం దుకు మారథాన్ వంటి ప్రజా అవగాహన కార్యక్రమాలు సమర్థవంతమైన వేదికలని ఆయన తెలిపారు. హైదరాబాద్లోని కాచిగూడలో శనివారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్ర మంలో ఏప్రిల్ 26న జరిగే ‘నోటి క్యాన్సర్ అవగాహన మారథాన్’కు సంబంధించిన వాల్ పోస్టర్‌ను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఈ మారథాన్‌ను హైదరాబాద్ స్మైల్స్ ఆధ్వర్యంలో కే దిలీప్ కుమార్ నాయకత్వంలో నిర్వహిస్తున్నారన్నా రు.

హైటెక్ సిటీలోని టీవర్క్స్ సమీపంలో 10 కిలోమీటర్ల మేర ఈ మారథాన్ నిర్వహించబడనుందన్నారు. నగరంలోని డెంటల్, ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన సు మారు పది వేల మంది విద్యార్థులు ఇందు లో పాల్గొననున్నారని తెలిపా రు.ఈ వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్‌రావు, డా. చంద్రకాంత్, డా. సంతోష్, డా. శరాస్, డా. నాగదీపిక, నాగ సౌమ్య తదితరులు పాల్గొన్నారు.