3 March, 2026 | 4:27 PM

హామీ ఇచ్చారు.. అమలుచేశారు

03-03-2026 12:00 AM
  1. ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్  నీళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం

రూ. 65 లక్షలతో ఓవర్ హెడ్ నీళ్ల ట్యాంక్ నిర్మాణానికి శంఖుస్థాపన

వర్తక సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కు ఘన సన్మానం

పినపాక, మార్చి 2 (విజయక్రాంతి): మండలం లోని ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్డు లో దశబ్దాల మంచి నీటి సమస్య కు ఎమ్మెల్యే పాయం కృషి తో శాశ్వత పరిష్కారం లభించింది.  తాగునీటి సమస్య ను పరిష్కరించాలని ఇటీవల ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ను ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్డు వర్తక సంఘం సభ్యులు కలిసి కోరారు. సమస్య ను విన్న ఎమ్మెల్యే వెంటనే స్పందించి ఆర్. డబ్ల్యూ. ఎస్ అధికారులతో మాట్లాడి అంచనాలు తయారు చేయాలని ఆదేశించారు.

డి ఎం ఎఫ్ టీ నిధులతో రూ 65 లక్షల అంచనా వ్యయంతో 93 వేలు లీటర్లు నిల్వ సామర్ధ్యం తో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ సందర్బంగా వాటర్ ట్యాంక్ నిర్మాణానికి సోమవారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శంఖుస్థాపన చేశారు. ఈ సందర్బంగా తమ సమస్యలకు శాశ్వతంగా పరిష్కారించినందుకు క్రాస్ రోడ్ వర్తక సంఘం, ఏడూళ్ల బయ్యారం గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు కృతజ్ఞతలు తెలుపుతూ  ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.

కార్యక్రమం లో తహసీల్దార్ గోపాలకృష్ణ, ఎంపీడీఓ కే వెంకటేశ్వరరావు, ఆర్.డబ్ల్య్యూ. ఎస్ డి ఈ బ్రహ్మ దేవ్,మండల సర్పంచులు, ఉప సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు జి రామనాధం, సీనియర్ నాయకులు గంగిరెడ్డి వెంకటరెడ్డి, కొర్సా ఆనంద్, జి శ్రీనివాస్ రెడ్డి, పేరం వెంకటేశ్వర్లు, దాట్ల రాజేష్, పోలిశెట్టి హరీష్, వి లక్ష్మిరెడ్డి, అచ్చా నవీన్, నిట్ట వెంకటేశ్వర్లు, సతీష్ చారి పాల్గొన్నారు.