6 July, 2026 | 1:57 PM

Breaking News

ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •  

జీసీసీ ద్వారా అటవీ ఉత్పత్తుల కొనుగోళ్లు..

05-05-2026 07:56 PM

ఉట్నూర్,(విజయక్రాంతి): గిరిజన సహకార సంస్థ (జీసీసీ) పరిధిలోని వివిధ గిరిజన ప్రాధమిక మార్కెటింగ్ సహకార సొసైటీ (జీపీసీఎంఎస్) ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అటవీ ఉత్పత్తుల కొనుగోళ్లు చేపట్టినట్లు గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఉట్నూర్ డివిజనల్ మేనేజర్ గుడిమళ్ల సందీప్ కుమార్ పేర్కొన్నారు.

మంగళవారం నాడు ఆదిలాబాద్ సొసైటీ ఆధ్వర్యంలో సేకరించి, నిల్వా చేసిన తేనె ను పరిశీలించారు. ఇప్పటివరకు జీసీసీ ద్వారా 25 క్వింటాళ్ళ తేనె ను, 122 క్వింటాళ్లు ఇప్పపువ్వు సేకరించినట్లు తెలిపారు. ఆదివాసీలు, గిరిజనులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని మధ్య దళారులకు అమ్మి మోసపోకుండా జీసీసీ డీఆర్ డిపోల వద్ద, సొసైటీ కార్యాలయాల వద్ద విక్రయించి రశీదు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ మేనేజర్ ఇస్తారి, సిబ్బంది గోవిందరావు, రమేష్, సవాయి రామ్ తదితరులు పాల్గొన్నారు.