22 April, 2026 | 2:57 AM

రైతుల సౌకర్యార్థం కొనుగోలు కేంద్రాలు

22-04-2026 01:16 AM

ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

ఉట్నూర్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): రైతు వద్ద నుండి గిట్టుబాటు ధరకే ధాన్యా న్ని కొనుగోలు చేసి, రైతును రాజు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం ఉట్నూర్ మండలం నాగపూర్ దాల్మిల్, ఇంద్రవెల్లి మండలంలోని మార్కెట్ యార్డులో మార్క్ ఫేడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న, జన్నారం, కడెం మండలంలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మార్క్ ఫేడ్ సంస్థ ద్వారా ప్రభుత్వమే రైతుల గిట్టుబాటు అయ్యే రేటుకే మొక్కజొన్న కొనుగోలు చేసేందుకు రైతుల సౌకర్యార్థం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. రైతులు మధ్య దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, రైతులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.