ప్రతి పేదవారికి సంక్షేమ పథకాలు అందేలా కృషి
కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్..
ఆలేరు, ఆగస్ట్ 17 (విజయక్రాంతి): ప్రజా పాలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నూతన పింఛన్ల కోసం అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నామని భువనగిరి 22వ వార్డు కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్ అన్నారు. 22వ వార్డు కార్యాలయంలో నూతన పింఛన్ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ స్వయంగా దరఖాస్తులను నింపడంతో పాటు లబ్ధిదారులకు అవసరమైన ఫారాలను అందజేశారు.
కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఏ ఒక్క నిరుపేద లబ్ధిదారుడు సంక్షేమ పథకాలకు దూరం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పింఛన్లు అందేలా కృషి చేస్తామని చెప్పారు. పేదలకు సంక్షేమ ఫలాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధికారి రాము, నాయకులు కిషోర్, వార్డు ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.






