17 August, 2026 | 5:19 PM

అక్రమంగా నిల్వ ఉంచిన 5 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం, ఒక మహిళ అరెస్ట్

17-08-2026 04:35 PM

భూపాలపల్లి టౌన్, ఆగస్టు 17 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా సీసీఎస్ పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు మొగుళ్లపల్లి మండల కేంద్రంలో దాడి నిర్వహించి అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 5 క్వింటాళ్ల ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని ఈ కేసులో తూర్పాటి సమ్మక్కను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యం, నిందితురాలిని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం మొగుళ్లపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓకు అప్పగించారు. అక్రమంగా పీడీఎస్ బియ్యం నిల్వ, రవాణా లేదా విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని  పోలీసులు హెచ్చరించారు.