సమస్యలు పరిష్కరించాలి
మంత్రి శ్రీధర్‌బాబును కోరిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
బడంగ్‌పేట్, మే 20 (విజయక్రాంతి): మహేశ్వరం నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి బుధవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనను శాలువాతో సత్కరించారు. బడంగ్‌పేట్, మీర్‌పేట్, బాలాపూర్ తదితర ప్రాంతాలలో నెలకొన్న సమస్యలపై లిఖిత పూర్వకంగా వినతి పత్రం అందజేశారు.
ఎమ్మెల్యే లేవనెత్తిన అంశాలపై మంత్రి సానుకూలంగా స్పందించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ సమస్యలన్నింటినీ పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. 33 కేవీ హై టెన్షన్ లైన్, ప్రతీ ఇంటికి 20వేల లీటర్ల ఉచిత మంచినీటి సరఫరా, రెసిడెన్షియల్ ప్రాంతాలను నిషేధిత జాబితా నుంచి తొలగించడం,
డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలను వేగవంతం చేయడం, పబ్లిక్ స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే మంత్రిని కోరారు. మంత్రి శ్రీధర్ బాబు సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో మీర్‌పేట్ కాలనీల అసోసియేషన్ సభ్యులు, బడంగ్‌పేట్, మీర్‌పేట్ మాజీ ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల ముఖ్య నాయకులు, మహిళా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






