అభివృద్ధి పనులను వేగవంతం చేయండి
భూత్పూర్, మే 20 : మున్సిపాలిటీ కేంద్రంలో నూతన కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక బుధవారం ప్రశాంతంగా ముగిసింది. ఈ సందర్భంగా చైర్మన్ మూడవత్ బాలకోటి అధ్యక్షతన నూతన కో ఆప్షన్ కోరే పవన్ కుమార్, ఆగిరి లావణ్య, ఎండి అఫ్రోజ్ పాషా, తన్వీర్ సుల్తానా సభ్యులను 8 మంది అనుకూలంగా వారికి ఓట్లు వేయడం ద్వారా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ భూత్పూర్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ఇటీవల ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 20 కోట్ల నిధులకు సంబంధించి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. భూత్పూర్ మున్సిపాలిటీలో అన్ని విధాల అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తానన్నారు.
డ్రైనేజ్, మంచినీటి సమస్య, సిసి రోడ్లు సమస్యలపై అధికారులతో చర్చించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలని తెలిపారు. నూతనంగా ఎన్నికైన కో ఆప్షన్ సభ్యులను ఎమ్మెల్యే ప్రోసిడింగ్ కాపీలను అందజేశారు. అనంతరం నూతన సభ్యులకు శాలువలతో ఘనంగా సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ సూర్య కళ, కౌన్సిలర్లు పద్మ, ఎం. మాధురి, అన్నపూర్ణ, లత సూరన్న గారి, చంద్రకళ, లాలూ నాయక్, శ్రీనివాసులు, గడ్డం ప్రేమ్ కుమార్, కో ఆప్షన్ మెంబర్లు కోరే పవన్ కుమార్, ఆగిరి లావణ్య, ఎండి. అఫ్రోజ్ పాషా, తన్వీర్ సుల్తానా తో పాటు తదితరులు పాల్గొన్నారు.






