19 May, 2026 | 9:44 PM

Breaking News

ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారిపై రాస్తారోక చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్   •   డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డిసిసిబి చైర్మన్   •   రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాల పట్టివేత   •   హిజ్రాల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ చర్యలు   •   పీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవల పరిశీలన   •   ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి   •   ఆందోళన వద్దు.. బంద్ రోజున మందులు అందుబాటులోనే   •   మంగళవారం సంతలో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం   •   మొక్కజొన్న స్టాక్ పాయింట్లను తనిఖీ చేసిన డీఎం   •   ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •  

పోచారం డివిజన్ లోని సమస్యలను పరిష్కరించాలి

21-02-2026 07:12 PM

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణరెడ్డి వినతి

ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఘట్ కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ 8 పరిధిలో నెలకొని ఉన్న పలు ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మాజీ మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి శనివారం తార్నాకలోని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ వినయ్ కృష్ణ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు.

ప్రజలకు పరిపాలన తత్వారగా అందే విధంగా 2 డివిజన్ లను ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే అన్నోజిగూడ డంపింగ్ యార్డ్ త్వరగా తరలించాలని, చౌదరిగూడ, వెంకటపురం, కొర్రెముల, కాచవాని సింగారం, ప్రతాపసింగారంలలోని వైకుంఠ దామాలను అభివృద్ధి చేయాలని, డివిజన్ పరిధిలోని నీటి పైపుల లీకేజీ సమస్యను తీర్చాలని, డివిజన్ పరిధిలోని పార్కుల నిర్వహణ, అభివృద్ధి పనులను చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. వారు సానుకూలంగా స్పందించినట్లు కొండల్ రెడ్డి తెలిపారు.