30 May, 2026 | 10:42 AM

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు అగ్నిప్రమాదం

30-05-2026 09:44 AM

చిట్యాల, మే 30 (విజయక్రాంతి): జాతీయ రహదారి 65పై చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి గ్రామ శివారులో  ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు అగ్నిప్రమాదం(Private Travel Bus Catches Fire) సంభవించింది. హైదరాబాద్ నుంచి కాకినాడకు వెళ్తున్న రైన్‌బో ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఎన్ ఎల్ 07 బి 0886 లో శనివారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పొగలు, మంటలను గమనించిన డ్రైవర్, క్లీనర్ వెంటనే అప్రమత్తమై బస్సును నిలిపివేసి ప్రయాణికులను కిందకు దింపారు.

దీంతో పెను ప్రమాదం తప్పిది.  ఆ సమయంలో బస్సులో సుమారు 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అందరూ సురక్షితంగా బయటపడగా, ప్రయాణికుల సామాన్లు మాత్రం మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఇంజిన్‌లో సాంకేతిక లోపం వల్లే మంటలు చెలరేగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ప్రమాదాన్ని ముందుగానే గుర్తించిన డ్రైవర్, క్లీనర్ అప్రమత్తతతో భారీ ప్రాణనష్టం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు.