గాంధీ ఆస్పత్రి నుంచి ఖైదీ పరార్
26-05-2026 01:04 PM
హైదరాబాద్: ఇనుప మేకులు మింగి చికిత్స పొందుతున్న చంచల్‌గూడ జైలు( Chanchalguda Jail) ఖైదీ గాంధీ ఆసుపత్రి నుంచి పారిపోయాడు. కొన్ని రోజుల క్రితం ఒక దొంగతనం కేసు సంబంధించి తిరుమలగిరి పోలీసులు సయ్యద్ అమీర్ హుస్సేన్ అరెస్టు చేసి, ఆ తర్వాత రిమాండ్‌కు తరలించారు. రిమాండ్ ఖైదీగా అతన్ని చంచల్‌గూడ జైలులో ఉంచారు. ఇనుప మేకులు మింగిన తర్వాత, జైలు అధికారులు అతన్ని హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి(Gandhi Hospital) తరలించగా, అక్కడ నుంచి అతను అధికారుల కళ్ళు కప్పి తప్పించుకున్నాడు. ప్రస్తుతం పోలీసులు ఖైదీని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.






