9 May, 2026 | 9:43 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

ప్రధాని సభను విజయవంతం చేయాలి

09-05-2026 08:33 PM

- బీజేపీ జిల్లా అధ్యక్షుడు భైరి శంకర్ ముదిరాజ్

సిద్దిపేట క్రైం: సికింద్రాబాద్ లో ఆదివారం జరిగే ప్రధాని మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు భైరి శంకర్ ముదిరాజ్ కోరారు. శనివారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడారు. మోదీ మూడోసారి ప్రదాని అయ్యాక తెలంగాణ  వస్తున్నారని, రూ.9 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. గతం లో తెలంగాణ అభివృద్ధికి రూ. 13 లక్షల కోట్లు ఇచ్చారని గుర్తు చేశారు. మోదీ సభకు సిద్దిపేట జిల్లా బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మోడీ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు.