calender_icon.png 4 February, 2026 | 6:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత

04-02-2026 03:48:31 PM

ఇంఫాల్: మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన(President Rule Lifted) ఎత్తివేశారు. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తూ బుధవారం నాడు గెజిట్ విడుదల చేశారు. ఖేమ్ చంద్ సింగ్ మణిపూర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. సాయంత్రం 6 గంటలకు ఖేమ్ చంద్ సింగ్ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. 2017-22 వరకు ఖేమ్ చంద్ సింగ్ మణిపూర్ స్పీకర్ గా పనిచేశారు. 2022లో బీరెన్ సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.

''ఎన్‌డిఎ శాసనసభ పక్ష నాయకుడు వై. ఖేమ్‌చంద్ సింగ్ బుధవారం సాయంత్రం 6 గంటలకు మణిపూర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని రాష్ట్ర బీజేపీ తెలిపింది. ప్రమాణ స్వీకార కార్యక్రమం లోక్ భవన్‌లో జరగనుంది. ఉదయం నుంచే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఖేమ్‌చంద్ సింగ్ మణిపూర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈరోజు, 2026 ఫిబ్రవరి 4వ తేదీన సాయంత్రం 6:00 గంటలకు లోక్ భవన్‌లో జరుగుతుంది." అని బీజేపీ మణిపూర్ ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో తెలిపింది.